పార్వతీపురం మన్యం సీతానగరం మండలంలో ఆదివారం నాడు లచ్చయ్యపేట గ్రామం సమీపంలో గుర్తుతెలియని మృతదేహాన్ని రాష్ట్రీయ రహదారి ప్రక్కనగల నీటిగుంటలో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగ ఏఎస్సై లెంక శ్రీనివాసరావు, పోలీస్ సిబ్బంది సోమేశ్వరరావు, అప్పలకొండలు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతునికి సంబందించి ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. స్తానికుల సహాకారంతో మృతదేహాన్ని బయటకు తీసారు. 30నుండి 35సంవత్సరాల మద్య వయస్సు కలిగిన యువకుడని, 5. 6 అడుగుల ఎత్తు, చామనచాయ రంగు, ఎరుపు రంగు షర్టు, నీలం జీన్ ప్యాంటు టక్ చేసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుని సమాచారం తెలిస్తే సీతానగరం పోలీసులకు సమాచారం ఇవ్వాలని పొలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం తరలించామని పోలీసులు తెలియజేశారు. మృతుడు పిట్స్ వంటి వ్యాధి వ్యాధి లక్షణాలతో చనిపోయాడా, ఇంకేమైనా జరిగిందాఅన్నది కూడా పోలీసులు విచారణ చేయాల్సివుంది. శనివారం రాత్రి మృతి చెందాడా లేదా ఆదివారం వేకువ జామున మృతి చెందాడా, మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.