ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంపై అనేక అనుమానాలు ఉన్నాయని ఎంపీ GVL నరసింహారావు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కూడా రైలు ప్రమాదంలో కుట్రకోణంపై ఆరా తీస్తోందని తెలిపారు. అవసరమైతే ఒడిశా రైల్వే ప్రమాదంపై CBIతో దర్యాప్తు చేస్తామని చెప్పారు. రైలు ప్రమాదానికి కారణమైన వారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.