ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, కోరుకొండ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే... వెంకటగిరి సప్లైకంపెనీని ముప్పిడిశెట్టి శ్రీను(30) నిర్వహిస్తున్నాడు.ఆదివారం రాత్రి 7 గంటల సమ యంలో సప్లై కంపెనీ షాపు వద్ద పని ముగించుకుని గొడౌన్ వద్దకు వెళ్లాడు. అక్కడ పనిచేసుకుంటూ ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి ముఖంపై కారం చల్లి ఆయుధంతో పొడిచి పరారయ్యారు. ఈ మేరకు గమనించిన కుటుంబీకులు వెంటనే రాజమహేంద్ర వరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. శ్రీనుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ శారదా సతీష్ తెలిపారు.