అరబిందో రియాల్టీ ఆధ్వర్యంలో కాకినాడ ఎస్‌ఈజెడ్‌పై రహస్య ప్రజాభిప్రాయ సేకరణపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలు, మత్స్యకారులకు సమాచారం ఇవ్వకుండా గుట్టుగా రేపు (మంగళవారం) ప్రజాభిప్రాయసేకరణ చేస్తుండడంపై స్పందనలో కలెక్టర్‌కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. తక్షణం ప్రజాభిప్రాయ సేకరణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. భారీ కాలుష్యం వెదజల్లే అరబిందో ఎస్ఈజెడ్ వద్దని టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు వర్మ, కొండబాబు వినతి చేశారు. అరబిందో ఎస్‌ఈజెడ్.. బల్క్ డ్రగ్ పార్క్ వస్తే కాకినాడ తీర ప్రాంతం కాలుష్యం అవుతుందని ధ్వజమెత్తారు. ప్రజాభిప్రాయ సేకరణపై ఎక్కడా పంచాయతీల్లో నోటీసులు ప్రదర్శించలేదని.. దండోరా కూడా వేయలేదని మండిపడుతున్నారు. జగన్ ప్రభుత్వం, జిల్లా కలెక్టర్, కాలుష్య నియత్రణ బోర్డు అధికారులు అంతా కుమ్మకై ప్రజలను మోసం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.