ప్రకాశం జిల్లా టంగుటూరు వద్ద దేశాన్ని కుదిపేసిన బాలాసోర్ రైలు దుర్ఘటన మరువక ముందే నేడు మచిలీపట్నం-తిరుపతి ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. రైలు తిరుపతి వెళ్తుండగా బోగీల్లోకి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే చైన్ లాగి రైలును ఆపేసి హుటాహుటిన ట్రైన్ నుంచి దిగిపోయారు. లూబ్రికెంట్ అయిపోవడంతో చక్రాల రాపిడితో మంటలు వ్యాపించినట్టు గుర్తించారు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.