ఉత్తరప్రదేశ్ లోని బల్లియా ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. సెల్ ఫోన్ కి ఛార్జింగ్ పెడుతుండగా విద్యుత్ షాక్ తగలడంతో 12 ఏళ్ల బాలిక శరీరం తీవ్రంగా గాయపడి మృతిచెందింది. సైదాపూర్ గ్రామంలో మాన్సీ అనే బాలిక సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుత్ షాక్ కు గురైంది. దీంతో బాలిక శరీరం తీవ్రంగా కాలిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది.