గత కొన్ని రోజులుగా అన్నవరం గ్రామం సంబంధించిన పంట పొలాలలో అడవి పందులు సంచరిస్తూ రైతుల పంటలను నాశనం చేస్తున్నాయి. ఇందుకు సంబంధించి వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలతో స్పందించిన చోడవరం అటవీ అధికారులు అడవిపందులు నాశనం చేసిన పొలాలను, సంబంధించిన రైతులతో సందర్శించారు. పంట నష్టం తీవ్రంగా ఉందని అయితే దీని కారణంగా పందులకు హాని చేయడం నేరమని అందువల్ల పందులు పంట పొలాల్లోకి రాకుండా ఉండడానికి కావలసిన సలహాలు సూచనలు రైతులకు అందించడం జరిగింది. ఇప్పటివరకు జరిగిన పంట నష్టాన్ని సచివాలయం అగ్రికల్చర్ ఆఫీసర్లు సర్టిఫై చేసి నివేదిక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి అందిస్తే రైతులకు నష్టపరిహారం అందించడానికి అవకాశం ఉంటుందని తెలియజేశారు. ఈ సందర్భంగా రైతులు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సాధ్యమైనంత త్వరగా నష్టపరిహారం అంచనా వేసి ఆదుకోవాలని మొరపెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పుల్లేటి సత్యనారాయణ పొట్నూరు సింహాచలం గంగాధర్ అటవీ అధికారులు పాల్గొన్నారు