పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చాంశనీయంగా మారాయి. ప్రజలు స్వచ్ఛందంగా చెత్త పన్నును కడుతున్నారని, అలాంటప్పుడు మీడియాకు ఉన్న ఇబ్బంది ఏమిటి? అని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి సోమవారం ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెత్త పన్నును వసూలు చేసింది. దీనిపై మీడియాలో వార్తలు రావడంతో ఆమె స్పందించారు. చెత్త పన్నును ప్రజలే స్వచ్ఛందంగా కడుతున్నారని వెల్లడించారు. ఈ పన్నును మున్సిపాలిటీలు, కార్పోరేషన్లు ప్రతిపాదించాయని, దీంతో చెత్తపన్ను వసూలుకు ప్రభుత్వం అభ్యంతరం చెప్పలేదన్నారు. వ్యర్థాల నిర్వహణపై వివిధ రాష్ట్రాలకు ఎన్జీటీ రూ.2వేల కోట్ల జరిమానా వేసిందని గుర్తు చేశారు.