కార్మిక సంఘాలతో ఆంధ్రప్రదేశ్ మంత్రుల కమిటీ సమావేశం ముగిసింది. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామన్నారు. 2014 జూన్ 2 నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని వెల్లడించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కేబినెట్లో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని బొత్స తెలిపారు.ఇక, ఉద్యోగుల డీఏ, పీఆర్సీ బకాయిలను 4 ఏళ్లలో 16 వాయిదాల్లో చెల్లిస్తామని వివరించారు. జీపీఎస్ లోనే మెరుగైన అంశాలను పొందుపరిచి అమలు చేస్తామన్నారు.గురుకులాల్లో బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచుతున్నట్లు తెలిపారు. యూనివర్సిటీల్లో బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచుతున్నట్లు వివరించారు.