మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు సోమవారం తిరస్కరించింది. అయితే, జస్టిస్ దినేష్ కుమార్ శర్మ, అనుకూలమైన రోజున ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల మధ్య తన భార్యను సందర్శించడానికి అనుమతించారు.సిసోడియా తన కుటుంబ సభ్యులతో తప్ప మరెవరితోనూ సంభాషించకూడదని ఆదేశించింది.సిసోడియా తన భార్యను కలిసేందుకు వెళ్లే చోట మీడియా గుమికూడకుండా చూసుకోవాలని ఢిల్లీ పోలీసులకు తెలిపింది.సిసోడియా మొబైల్ ఫోన్ లేదా ఇంటర్నెట్‌ను ఉపయోగించడాన్ని అనుమతించబోమని, అతని భార్యకు సాధ్యమైనంత ఉత్తమమైన వైద్యం అందించాలని కోర్టు ఆదేశించింది.