చాక్లెట్లు అడిగిందని కన్నకూతుర్ని రాళ్లతో కొట్టి చంపిన దారుణ ఘటన ఇండోర్ లో జరిగింది. సదరు వ్యక్తి డ్రగ్స్ కు బానిసగా మారడంతో మూడేళ్ల క్రితం భార్య వదిలేసి వెళ్లిపోయింది. వారి 8 ఏళ్ల కూతురు భర్త వద్దే ఉంటోంది. చిన్నారి తరచూ చాక్లెట్లు, బొమ్మలు, బట్టలు కావాలని అడుగుతుండటంతో నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్దకు తీసుకువెళ్లి టైల్స్, రాళ్లతో తలను చితకబాది హత్య చేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.