ప్రొద్దుటూరు మునిసిపల్ పరిధి లోని 22 వ వార్డులో ఉన్న మహమ్మదీయ కాలనీలో తాగునీటి పైపులైన్ నిర్మాణానికి మున్సిపల్ వైస్ చైర్మెన్ పాతకోట బంగారు మునిరెడ్డి సోమవారం భూమిపూజ చేశారు. కార్యక్రమంలో వార్డు ఇంచార్జ్ హిదాయత్ , 23వ వార్డు కౌన్సిలర్ వడ్ల ఖలీల్, భీమునిపల్లి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.