రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆశా వర్కర్లకు ఎగ్జామ్ నిర్వహించే పద్ధతిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పోచంపల్లి మెడికల్ ఆఫీసర్ యాదగిరికి సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. సిఐటియు మండల కన్వీనర్ మంచాల మధు మాట్లాడుతూ అనేక సంవత్సరాల నుండి రాష్ట్రంలో ఆశా వర్కర్లు పేద ప్రజలకు సేవలు అందిస్తున్నారని, ఆసుపత్రిలలో డెలివరీ చేయడం ద్వారా మాతా శిశు మరణాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు