ఏపీలో ఎండల ప్రభావం కొనసాగుతోంది. రాష్ట్రంలో మరో మూడు రోజులు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నేడు అల్లూరి జిల్లా నెల్లిపాక, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం మండలాల్లో, అదేవిధంగా ఏలూరు జిల్లా కుకునూర్, వేలేరుపాడు మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 212 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.