తెనాలి పట్టణంలోని చంద్రబాబునాయుడు కాలనీ, ఆర్ఆర్ నగర్ కాలనీకి చెందిన పలువురు మహిళలు సోమవారం తహసీల్దారు కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఆర్ ఆర్ నగర్ కాలనీకి చెందిన నసీమా తమ చిట్టీల డబ్బులు తీసుకుని మోసం చేసిందని బాధిత మహిళలు వాపోయారు. తమతో పాటు అనేక మంది మహిళలకు ఆమె నగదు ఇవ్వాలని, తమకే రూ. 20 లక్షల వరకు నగదు రావాల్సి ఉందని తెలిపారు. ఎవరికీ చెప్పకుండా సామాన్లతో సహా ఖాళీ చేసి వెళ్లిపోయిందన్నారు.