మంగళగిరి నగరంలోని టిడ్కో గృహ వాసులను త్రాగునీటి కొరత వేదిస్తోంది. గృహ ప్రవేశాలు జరిగి 8 నెలలు గడిచినప్పటికీ సమస్యల పరిష్కారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. అసలే వేసవి కావటంతో కనీసం వాడుకునేందుకు సైతం నీళ్లు రాక ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇక పై అంతస్తులో ఉండే వారి పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఎవరైనా ట్యాంక్ ఏర్పాటు చేస్తే రోజువారి అవసరాల నిమిత్తం క్రింద నుండి పై అంతస్తు వరకు నీటి బిందెలను మోసుకొని వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు.
అధికారులు చొరవ తీసుకొని నీటి కష్టాలను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. కాగా సామాజిక మాధ్యమాల్లో వచ్చిన సమస్యపై ఎమ్మెల్యే ఆర్కే స్పందించారు. నీటికొరతపై డీఈ కృష్ణా రెడ్డిని ఆయన వివరణ కోరారు. నీటిని అందించే మోటార్లకు విద్యుత్ ను అందించే విద్యుత్ టాన్ఫర్మర్లు మరమ్మత్తులకు గురుకావడం వలన నీటి సరఫరా నిలిపిపోయిందని గంటల వ్యవధిలోనే నీటిని సరఫరాచేస్తామని డీఈ కృష్ణారెడ్డి చెప్పారు.