కాకినాడ సెజ్ ప్రజాభిప్రాయ సేకరణను టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సెజ్ అడ్డుకునేందుకు యత్నిస్తున్న టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో కొత్తపల్లి మండలం మూలపేటలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సెజ్ ప్రజాభిప్రాయ సేకరణ సభ వద్దకు వెళ్లకుండా భారీగా పోలీసులు మోహరించారు. అయినా వెనుక దారుల్లో వెళ్ళడానికి మత్స్యకారులు, టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.