పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదలపై కేంద్రం శుభవార్త చెప్పింది. రూ.12,911.15 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. బిల్లుల చెల్లింపులో విభాగాల వారీగా పెట్టిన పరిమితులను తొలగించడానికి కూడా ఓకే చెప్పింది. అలాగే, ప్రాజెక్టుకు 2013–14 ధరలతో కాకుండా తాజా ధరలతో నిధులిచ్చేందుకు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ (వ్యయ విభాగం) డైరెక్టర్ ఎల్కే త్రివేది సోమవారం రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్‌కు లేఖ రాశారు.