పొత్తులపై వైయస్ఆర్సీపీకి స్పష్టమైన విధానం ఉందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికలు వస్తుంటే రాజకీయ పార్టీలతో పొత్తుల కోసం వెంపర్లాడటం చంద్రబాబు దిగజారుడు రాజకీయానికి నిదర్శనమని విమర్శించారు. అవసరం అయితే పొత్తులు పెట్టుకోవడం, అవసరం తీరాక దూషణలు చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని ఎద్దేవా చేశారు.