గర్భవతులకు ఐరన్ మాత్రల వాడకం చాలా అవసరమని ఎర్రకోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ కిషోర్ కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం అన్నమయ్య జిల్లా, కలకడ మండలం, ఎర్రకోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కె. దొడ్డిపల్లిలో వైద్యాధికారి ఆధ్వర్యంలో ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమం జరిగింది. గర్భవతుల నమోదు చేసి వైద్య పరీక్షలు చేయించాలని అన్నారు. ముఖ్యంగా వారిలో హై రిస్క్ గర్భవతులను గుర్తించి ఉన్నత స్థాయి వైద్యశాలలకు రెఫర్ చేయాలని, సాధారణ గర్భవతులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనే కాన్పు చేయించాలని చెప్పారు. రక్తం 10 గ్రాముల కన్నా తక్కువ ఉన్న వారిని గుర్తించి, వారికి ఐరన్ సుక్రోజ్, ఐరన్ టాబ్లెట్స్ ఇవ్వాలని సూచించారు. 50 ఏళ్లకు పైబడిన వయస్సు ఉన్న వారందరినీ ఫ్యామిలీ పిజిషన్ కార్యక్రమానికి పిలవాలని, వారికి మధుమేహం, రక్తపోటు పరీక్షలు నిర్వహించి ఆన్లైన్లో నమోదు చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. మాతా శిశు సంరక్షణ కార్డును సంపూర్ణంగా పూరించి, గ్రోత్ చార్టు ఐఎఫ్ఏ టానికుల వివరములను అందులో పొందుపరచాలని పేర్కొన్నారు.