ఒడిశాలో ఇటీవల రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా జార్ఖండ్ లో మరో రైలుకు ప్రమాదం తప్పింది. ఢిల్లీ- భువనేశ్వర్ రాజధాని ఎక్స్ ప్రెస్ వెళ్తుండగా ఓ ట్రాక్టర్ రైల్వే గేట్, ట్రాక్ మధ్య ఇరుక్కుపోయింది. సంతాల్ది రైల్వే క్రాసింగ్ వద్ద గేటు వేస్తుండగా ట్రాక్టర్ ఆగిపోయిందని, లోకో పైలట్ అప్రమత్తమై రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. దీంతో రైలు 45 నిమిషాలు ఆలస్యమైంది.