రాజస్థాన్ లోని బికనీర్ లో మంగళవారం రాత్రి స్వల్ప భూకంపం సంభవించింది. రాత్రి 11.36 గంటల సమయంలో భూప్రకంపనలు సంభవించాయని స్థానికులు తెలిపారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదయింది. బికనీర్ కు పశ్చిమాన 685 కి.మీల దూరంలో, 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఈ భూకంపంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని పేర్కొంది.