రాష్ట్ర ప్రభుత్వం పెంచిన భూముల మార్కెట్ విలువను తగ్గించాలని సీపీఎం కర్నూలు జిల్లా కార్యదర్శి డి.గౌస్ దేశాయ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ ఎదుట సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా గౌస్దేశాయ్ మాట్లా డుతూ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారం మోపుతోందని అన్నారు. ఆదాయం పెంచుకోవడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ఏటా భూముల మార్కెట్ విలువతోపాటు ఇంటి పన్నులు పెంచడం దారుణమన్నారు. ఈ కార్యక్ర మం లో జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు పీఎస్రాధాక్రిష్ణ, నగర కార్య దర్శులు టి.రాముడు, రాజశేఖర్, రామాంజనేయులు పాల్గొన్నారు.