రైల్వేశాఖలో ఖాళీగా ఉన్న 3.15 లక్షల పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని డీవైఎ్ఫఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముడియం చిన్ని, వీరనాల శివకుమార్ డిమాండ్ చేశారు. కడప స్థానిక జిల్లా కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. దేశంలో అతి పెద్దరవాణా సంస్థ అయిన రైల్వేశాఖలో కేంద్ర ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. దీంతో మిగతా ఉద్యోగులు తీవ్ర పని వత్తిడితో సతమతమవుతున్నారన్నారు. తద్వారా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఒడిశా రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత ముమ్మాటికీ బీజేపీ ప్రభుత్వానిదే అన్నారు. ఈ సమావేశంలో నగర కార్యదర్శి డీఎం ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.