రోడ్డు ప్రమాదాలు నివారణ చర్యలలో భాగంగా దృశ్య శ్రవణ సాధనం ద్వారా ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమం మంగళవారం కంచరపాలెం మెట్టు వద్ద ప్రత్యేక దృశ్య శ్రవణ వాహనం ద్వారా రోడ్డు ప్రమాదా లపై అవగాహన కల్పించే విదంగా గతంలో జరిగిన రోడ్డు ప్రమాదల దృశ్యలను ప్రదర్శిస్తూ ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమం కంచరపాలెం ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మళ్ల అప్పారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జోన్ 2 ఏసిపి జి రాజీవ్ కుమార్ హాజరయ్యి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మేరకు దృశ్య శ్రావణ వాహనం( డిజిటలైజేషన్ వాహనం) ద్వారా వాహన చోదకులకు స్థానికులకు పాదాచారులకు ట్రాఫిక్ నిబంధనలు పై అవగాహన కల్పించారు. అదేవిధంగా ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పక ధరించాలని అధిక వేగమే ప్రమాదలకు కారణం అవుతున్నదని నిర్దేశించిన వేగంలోనే వాహనాలు నడపాలని ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడిపి ప్రమాదలకు గురి కాకుండా ఉండాలన్నారు. ఈకార్యక్రమం లో ట్రాఫిక్ యస్ ఐ లు పాపారావు, కానిస్టేబుళ్లు రాజేష్, పాల్గున్నారు.