చిన్నారులు పఠన నైపుణ్యాలు పెంపొందింపజేసుకోవాలని సెయింట్ అంతోని ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు డి సంజీవ కుమార్ అన్నారు. బాలల శాఖా గ్రంథాలయంలో బుధవారం హాజరయ్యారు. వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా రీడ్ అలాంగ్ యాప్ ఉపయోగాలు వివరించారు. విద్యార్థులు ఫోన్లలో యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాలని కోరారు. హాస్యకథలు, నీతి పద్యాలు చెప్పారు. ఇటీవల రైలు ప్రమాదంలో మృతి చెందిన వారిని స్మరించుకుంటూ మౌనం పాటించి కొవ్వొత్తులతో నివాళులర్పించారు. కార్యక్రమంలో గ్రంథాలయ అధికారిణి టి. పోలితల్లి, విద్యార్థులు పాల్గొన్నారు.