గాజువాక నియోజక వర్గ పరిధిలోని 65 వార్డు వాంబే కాలనీ కొండపై వెలసిన విజయ దుర్గ అమ్మవారి పండుగ మహోత్సవంలో భాగంగా 65వార్డ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రట్టి వాసు ఇంటి వద్ద శ్రీ విజయదుర్గ అమ్మవారి ఘటానికి వేద పండితులతో బుదవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నవదుర్గల వేషధారణలతో, డప్పులతో, భారీ మందుగుండు సామాగ్రితో రట్టీ వాసు దంపతులు విజయ దుర్గ అమ్మవారి ఘటాన్ని ఊరేగింపుగా వాంబే కాలనీ కొండపై కొలివై ఉన్న విజయ దుర్గ అమ్మవారి ఆలయానికి తీసుకువచ్చి గ్రామ దేవత పండుగను ముగించారు. ఈ పండుగ మహోత్సవంలో గాజువాక తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
దీనిలో భాగంగారట్టి వాసు మాట్లడుతూ శ్రీ విజయ దుర్గ అమ్మవారి ఆశీస్సులతో వాంబే కాలనీ గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని మనసార కోరుకుంటు పండుగ మహోత్సవంలో మా ఇంటి వద్ద అమ్మవారి ఘటానికి పూజలు నిర్వహించి ఘటముతో ఊరేగింపుగా అమ్మవారి దేవాలయానికి వెళ్లి అమ్మవారి ఘటాన్ని గ్రామ దేవతకు చూపించి పండుగను విరమించుకున్నాం అని అన్నారు. అలాగే టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకి ఆ అమ్మవారీ ఆశీస్సులు నిండు నూరేళ్లు ఉండాలని అమ్మవారికి మనసారా కోరుకుంటున్నామని అన్నారు. ఈ ఘట్టాల ఊరేగింపు కార్యక్రమంలో వాంబే కాలనీ గ్రామ కమిటీ సభ్యులు వార్డు పురా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.