ఏపీలో ముందస్తు ఎన్నికలపై సీఎం జగన్మోహన్రెడ్డి కీలక ప్రకటన చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని తేల్చిచెప్పారు. ఇంకో 9 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయని మంత్రులకు తెలిపారు. ఈ 9 నెలలు బాగా కష్టపడాలని సూచించారు. ఇప్పుడు కష్టపడితే మళ్లీ గెలుపు తమదేనని మంత్రులకు దిశానిర్దేశం చేశారు.