భారత వాతావరణ విభాగం శుభవార్త చెప్పింది. మరో 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని ప్రకటించింది. ఐఎండీ ప్రకటన ప్రకారం మరో రెండు రోజుల్లో దక్షిణాదిలో వర్షాలు కురుస్తాయి. ఆ తర్వాత క్రమంగా అన్ని ప్రాంతాలకు మాన్సూన్ విస్తరించనుంది. కాగా మే ఆఖరి వారం నుంచి ఇప్పటివరకు నిత్యం 40 డిగ్రీల కంటే పైనే పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఐఎండీ తీపి కబురు చెప్పింది.