ఢిల్లీ మద్యం కుంభకోణంలో మాగుంట రాఘవకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రెండు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రాఘవ అమ్మమ్మకు అనారోగ్యం కారణంగా బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ను స్వీకరించిన కోర్టు మాగుంట రాఘవకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణంలో శరత్చంద్రారెడ్డికి కోర్టు ఇప్పటికే రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.