అనకాపల్లి పట్టణంలోని స్థానిక నాలుగు రోడ్ల జంక్షన్ (నెహ్రు చౌక్ జంక్షన్) వద్ద ఇటివల ఒరిస్సా రైలు ప్రమాదంలో మరణించిన వారి ఆత్మ శాంతి చేకూరాలని పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీ చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీశాసనసభ్యులు, నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి పీలా గోవిందమాట్లాడుతూరైలు ప్రమాద బాధితులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలనీ డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలలో ఒక్కరికీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, ప్రమాదానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పోలారపూ త్రినాథ్, బొద్దపూప్రసాద్, సబ్బవరపుగణేష్, కొణతాల రత్న కుమారి, ఆళ్ళ రామచంద్రా రావు, ఆకుల నానాజీ, సూరి సతీశ్ కుమార్, దనాల విష్ణు చౌదరి, తదితరులు పాల్గొన్నారు.