రాష్ట్ర ముఖ్య మంత్రి సహాయనిధి నుండి పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం మార్తు వారి పల్లి కి చెందిన చిన్న పాపకు రూ. 1. 50లక్షలు, తిమ్మనాయుని పల్లికి చెందిన అమరావతమ్మ కు రూ. 1. 70 లక్షలు, జంగంపల్లి కి చెందిన నాగరాజుకు రూ. 38, 000/- బయ్యా రెడ్డి గారి పల్లికి చెందిన చలపతికి 35, 000/- చెక్కులను గురువారం రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మంత్రి ముఖ్యమంత్రులకు ధన్యవాదాలు తెలియజేశారు.