టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర సందర్భంగా బుధవారం కడపలో జరిగిన మిషన్ రాయలసీమ కార్యక్రమంలో కుప్పం టీడీపీ నేతలు పాల్గొన్నారు. అనంతపురాన్ని ఆటోమొబైల్ హబ్ గా, చిత్తూరును ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్ గా, కర్నూలును వ్యవసాయ పరికరాల తయారీ హబ్ గా, అలాగే ఇండస్ట్రియల్ కారిడార్ కేంద్ర బిందువుగా, కడపను క్రీడల హబ్ గా తయారు చేయటమే మిషన్ రాయలసీమ లక్ష్యమని ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్, కుప్పం నియోజకవర్గ ఇంచార్జ్ మునిరత్నం పేర్కొన్నారు.