ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ దక్షతకు పోలవరం ఓ నిర్వచనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 08, 2023, 11:44 AM

ప్రతి అవకాశంలోనూ తన వక్తిగత ప్రయోజనం వెతుక్కునేవాడు రాజకీయనాయకుడు .. ప్రతి అవకాశాన్ని సమాజ హితం కోసం వినియోగించేవారు ప్రజాసేవకుడు. పోలవరం అంశం కూడా అంతే ... చంద్రబాబు ఆ ప్రాజెక్టును తనకు,, తన అనుయానులకు ప్రయోజనకరంగా ఉండేలా వాడుకున్నారు. జగన్ వచ్చాక దాని తీరుతెన్నులు మారాయి. కేంద్రం సైతం జగన్ వాదనతో ఏకీభవించి అదనంగా నిధులు ఇవ్వడానికి ఒప్పుకున్నది. 

- బృహత్తరమైన ఈ ప్రాజెక్ట్ ఏళ్ల తరబడి కొనసాగుతుంది తప్ప తుది రూపు దాల్చ లేదు. 
- మహానేత అనంతరం పాలకుల నిర్లక్ష్యం..  అంచనా వ్యయం పెంచేసి దోపిడీ కారణంగా ప్రాజెక్ట్ ఫలాలు ప్రజలకు అందించలేదు.  
- తెలుగు ప్రజల ఆశలతో దోబుచులాడుకున్న చంద్రబాబు నయా గ్యాంగ్ 
-  పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే ఆంధ్ర రాష్ట్రంలో 27 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు
- ఉభయ గోదావరి జిల్లాలో 10 లక్షలు, కృష్ణ జిల్లాలో మరో 13 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ
- పోలవరం నుంచి విశాఖపట్నం వరకు 182 కి. మీ ఎడమ కాలువ ద్వారా 4 లక్షల ఎకరాలకు  సాగు నీరు 
- 172 కి.మీ పొడవున్న కుడి కాలువ ద్వారా విజయవాడ వరకు మరో 3.20 లక్షల ఎకరాలకు అదనంగా సాగు నీరు సరఫరా చేయవచ్చు
- పోలవరం రిజర్వాయర్ లో భారీగా నీటిని నిల్వ చేసే అవకాశం ఉంది
- ఈ ప్రాజెక్ట్ ద్వారా 960 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు
- మెట్ట ప్రాంతంలో 540 గ్రామాలకు తాగు నీరు అందించేందుకు వీలు ఉంది
- బాబు జగజ్జీవన్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా 3 జిల్లాలకు 3 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించవొచ్చు
- ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ ప్రాజెక్టుకు సమీపంలో చంద్రబాబు పట్టిసీమ ఎత్తి పోతల పథకానికి చంద్రబాబు రూపకల్పన చేసి తూట్లు పొడిచాడు 
-  బృహత్తరమైన పోలవరాన్ని వదిలేసి కాంట్రాక్టర్లకు లబ్ది చేకూరేలా పట్టి సీమను పూర్తి చేయడానికి బాబు ఆసక్తి చూపించారు
- పోలవరాన్ని పూర్తి చేద్దాం అనే ఆలోచన చంద్రబాబుకు లేదు.. అందుకే నాడు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం ఐన చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు నటించాడు
- ప్రణాళిక బద్దంగా నిధులు కేటాయింపు చేయలేదు.. వాటి కోసం ఎటువంటి ప్రయత్నం కూడా  బాబు చేయలేదు (కారణం ఓటుకు నోటు కేసు వలన)
- పోలవరం పూర్తి చేయాలనే దృఢ సంకల్పం చంద్రబాబుకు లేదు
- పట్టిసీమ పై పెట్టిన డబ్బులు పోలవరం పై పెట్టి ఉంటే.. పోలవరం సాగ భాగం పూర్తి అయ్యేది
- పట్టిసీమ మూలంగా 70 టీఎంసీ ల నీరు కృష్ణ జిల్లాకు వెళ్తుంది.. అదే పోలవరం పూర్తి అయితే 80 టీఎంసీల నీరు వెళ్తుంది. 
- పట్టిసీమ పేరుతో ప్రజా ధనం దోపిడీ చేసింది చంద్రబాబు ప్రభుత్వం.

జగన్ దక్షతకు పోలవరం ఓ నిర్వచనం 
టిడిపి శాపం నుండి విముక్తి కలిగించిన సీఎం వైఎస్ జగన్ 2013-14 ధరల ప్రకారం ఐతే రావాల్సింది రూ. 1249 కోట్లే సీఎం జగన్ సమర్థతతో కేంద్రం నుంచి 12,911 కోట్లు సాధించిన వైనం మరో రూ. 10000 కోట్లు అడిగిన సీఎం వైయస్ జగన్..సానుకూలంగా స్పందించిన ప్రధాని ఇక పోలవరం పనుల్లో గణనీయమైన పురోగతి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com