చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న క్లాప్ ఆటో డ్రైవర్లకు రెడ్డి ఎంటర్ప్రైజెస్ మ్యాన్ పవర్ ఔట్సోర్సింగ్ ఏజెన్సీ విజయవాడ వారు ప్రతినెల సక్రమంగా జీతాలు ఇవ్వాలని, క్లాఫ్ ఆటో డ్రైవర్లను స్కిల్ కార్మికులుగా గుర్తించి కనీస వేతనం ఇవ్వాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా సహాయ కార్మికశాఖ అధికారికి గురువారం వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్లాప్ ఆటో డ్రైవర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించడానికి రెడ్డి ఎంటర్ప్రైజెస్ మ్యాన్ పవర్ ఔట్సోర్సింగ్ గుర్తింపు కార్డు మంజూరు చేయాలన్నారు. ప్రభుత్వం నిబంధన ప్రకారం సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.