పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం వినుకొండ పట్టణంలో శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో వేడుకలు నిర్వహించారు. సత్తెనపల్లి టిడిపి ఇన్చార్జ్ కన్నా లక్ష్మీనారాయణ, వినుకొండ మాజీ ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం రానున్నది. ప్రజలకు మంచి రోజులు రానున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.