ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతు ఖాతాల్లో జమకాని రైతు భరోసా నిధులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 08, 2023, 03:13 PM

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహాన్ రెడ్డి తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని ఆర్భాటంగా ప్రకటించి, రైతు భరోసా నిధులను నేరుగా జమ చేయడానికి బటన్ నొక్కరు. ఇది జరిగి రోజులు గడుస్తున్నా అర కోర మినహా మెజార్టీ రైతుల ఖాతాల్లో నిధులు జమ కాలేదని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పోరెడ్డి రమణారెడ్డి ఆరోపించారు. దీని పై గురువారం ఆయన మదనపల్లెలో తమ కార్యాలయంలో మాట్లాడుతూ..ఇప్పటికీ చాలామంది రైతు ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ కాలేదని విమర్శించారు. దీని పై ప్రభుత్వం వెంటనే ఒక ప్రకటన విడుదల చేసి రైతుల సందేహాలను నివృత్తి చేయాలని కోరారు. అంతేకాకుండా సకాలంలో నిధులు జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముస్తఫా, సురేంద్ర, గోపాల్, రామ్ చరణ్ లు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com