తిరుపతి రూరల్ మండలం పాతకాల్వ పంచాయితీ (పేరూరు బండపై) వెలసిన శ్రీ వకుళమాత ఆలయ మొదటి వార్షికోత్సవానికి రావాలని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తిరుపతిలోని మంత్రి నివాసంలో గురువారం డిప్యూటీ ఈఓ వరలక్ష్మి మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వానించారు. వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తామని మంత్రికి వివరించారు. ఆమె వెంట టెంపుల్ ఇన్స్పెక్టర్ శివ ప్రసాద్, టీటీడీ పాలకమండలి సభ్యుడు పోకల అశోక్ కుమార్ పాల్గొన్నారు.