రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలన్నది ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ధృడ సంకల్పం. ఈ లక్ష్యంతో చిన్న మున్సిపాలిటీల్లోనూ చెత్త సేకరణకు పర్యావరణహితంగా ఉండే విద్యుత్తు ఆటోలను (ఈ–ఆటోలను) ప్రవేశపెడుతున్నారు. తద్వారా ఆ మున్సిపాల్టి లకు నిర్వహణ భారం కూడా తగ్గుతుంది. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి జెండా ఊపి వీటిని ప్రారంభించనున్నారు. రూ.4.10 లక్షల విలువైన 516 ఈ–ఆటోలను మొత్తం రూ.21.18 కోట్ల వ్యయంతో కొనుగోలు చేశారు. వీటిని 36 మున్సిపాల్టి లకు పంపిణీ చేస్తారు. ఈ ఆటో సామర్థ్యం 500 కిలోలు. మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తూ ‘ఈ– ఆటోల‘ డ్రైవర్లుగా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.