చెత్త సేకరణ కోసం ప్రభుత్వం సమకూర్చిన ఈ–ఆటోలతో మున్సిపాలిటీలపై ఆర్థిక భారం తగ్గుందని మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఐదు క్వింటాళ్ల సామర్థ్యం కలిగిన వాహనాలను కొనుగోలు చేశామని చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీస్‌లోని మీడియా పాయింట్ వద్ద మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడారు. రాష్ట్రంలో వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులను చేపట్టామన్నారు. రాష్ట్రంలో కోటి 20 లక్షల డస్ట్‌బిన్‌లను ప్రజలకు అందించామన్నారు. తడి, పొడి చెత్త సేకరణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. మురుగునీటిని శుద్ధి చేసే ప్రాజెక్టులను కూడా నిర్మిస్తున్నామని, రానున్న రోజుల్లో చెత్త రహిత రాష్ట్రం సాకారం అవుతుందన్నారు.