టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆ పార్టీ నాయకుల పైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. తన లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల టీడీపీ ఇన్చార్జ్లు గొట్టంగాళ్లు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన మహానాడుకు తనను పిలవలేదని, విజయవాడలో టీడీపీ కార్యాలయ ప్రారంభోత్సవానికి కూడా ఆహ్వానం లేదని, ఆ కార్యక్రమానికి అచ్చెన్నాయుడు వచ్చాడని.. ప్రజలకు దీనివల్ల ఎలాంటి మెసేజ్ ఇచ్చారని ప్రశ్నించారు.