ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాకు ఎటువంటి పదవులు లేవు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 08, 2023, 03:49 PM

ఎంపీ కేశినేని నాని నేడు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను తెలుగుదేశం పార్టీలో సభ్యుడిని మాత్రమేనన్నారు. తనకు ఎటువంటి పదవులూ లేవన్నారు. కేంద్ర హోం మత్రి అమిత్ షా, టీడీపీ అధినేత చంద్రబాబు కలయికపై తాను ఏమీ చెప్పలేనన్నారు. అభివృద్ధి విషయంలో ‌తాను పార్టీలు చూడబోనన్నారు. అందరినీ కలుపుకుని ప్రజల కోసం పని‌చేస్తానన్నారు. ఎవరో ఏదో తన మీద ప్రచారం చేశారని తాను స్పందించబోనన్నారు. తాను ఏదీ చేసినా మెచ్చుకునే వాళ్లు, తిట్టుకునే వాళ్లు ఉంటారన్నారు. తాను రాజకీయాల్లో ఏం చేస్తాననే దాని పై తనకు స్పష్టత ఉందని కేశినేని నాని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com