ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రేమికురాలు దక్కలేదని యువకుడు ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 08, 2023, 03:50 PM

ప్రేమ దక్కకపోతే కొందరు ఉన్మాదుల్లా తయారవుతుంటే.. మరికొందరు ప్రేమించిన ప్రియుడు/ప్రియురాలు దక్కకపోతే ప్రాణాలు తీసుకుంటారు. కన్నవాళ్లకు కడుపుకోత మిగులుస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే తిరుపతిలో చోటు చేసుకుంది. ప్రియురాలు వేరే వాళ్లను పెళ్లిచేసుకోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన ప్రియుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. చంద్రగిరి మండలం రెడ్డివారిపల్లెకు చెందిన మురళి (28) గత కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు వీరి ప్రేమను అంగీకరించలేదు. పైగా ఆ యువతికి వేరే వ్యక్తితో వివాహం జరిపించారు. ప్రియురాలి పెళ్లి విషయం తెలిసిన మురళి తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. తన ప్రేమ దక్కకపోవడానికి ప్రాణాలు తీసుకోవానికి కూడా వెనకాడలేదు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మురళి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుమారుడి మరణంతో తల్లిదండ్రులు ఆవేదనకు అంతేలేకుండాపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com