భారత వాతావరణ శాఖ ప్రజలకు చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు గురువారం కేరళ తీరాన్ని తాకినట్లు వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే 7 రోజులు ఆలస్యంగా రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. దక్షిణ అరేబియా సముద్రంలోని అన్ని ప్రాంతాలకు రుతుపవనాలు వ్యాపించినట్లు ఐఎండీ ఓ ప్రకటనలో తెలిపింది. రుతుపవనాలు జూన్ 4న కేరళ తీరాన్ని తాకుతాయని గతంలో అంచనా వేయగా.. నాలుగు రోజులు ఆలస్యంగా రుతుపవనాలు రావడం గమనార్హం.