నగరం ఎస్సై రామకృష్ణ వివాహం గురువారం మార్కాపురం లోని సౌజన్య ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరిగింది. ఎస్ రామకృష్ణ వివాహానికి రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. నూతన వధూవరులు సుఖ సంతోషాలతో, ఆనందంగా జీవించాలని ఎంపీ మోపిదేవి ఆకాంక్షించారు. ఎస్ఐ రామకృష్ణ వివాహానికి రేపల్లె నియోజకవర్గం లోని ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.