రాజోలు నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి దెబ్బ పడింది. 2019 ఎన్నికల్లో వైసీపీ తరుఫున పోటీ చేసిన నాయకుడు ప్రస్తుతం జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇక తాజాగా తుని నియోకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. పార్టీకి వైసీపీ రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి మోతుకూరి వెంకటేష్ రాజీనామా చేశారు. వైసీపీ స్థాపించినప్పటి నుంచి పార్టీలో వెంకటేష్ కీలకంగా వ్యవహరించారు. కష్టకాలంలో మంత్రి దాడిశెట్టి రాజాకు అన్నీ తానై వ్యవహరించారు. మొన్న ఎన్నికల్లో రాజా నెగ్గడంలో కీలక పాత్ర వహించారు. తీరా అధికారంలోకి వచ్చాక మంత్రి రాజా పక్కనపెట్టారు. కొన్నిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. పదవితో పాటు పార్టీకి రాజీనామా చేసిన ఈ లేఖను అధిష్టానానికి వెంకటేష్ పంపారు.