ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అల్లుడు ఎవరు,,రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ

national |  Suryaa Desk  | Published : Fri, Jun 09, 2023, 10:41 PM

ప్రముఖుల వివాహాలు సహజంగానే చర్చలో ఉంటాయి. ఇదిలావుంటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కుమార్తె వివాహం.. అత్యంత సాధారణంగా జరిగింది. అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల మధ్య బుధవారం బెంగళూరులో వివాహ వేడుకను నిర్వహించారు. రాజకీయ ప్రముఖులెవరూ ఈ పెళ్లికి హాజరు కాకపోవడం గమనార్హం. అయితే ఈ సమయంలోనే వరుడు ఎవరు అన్నదానిపై తీవ్ర ఆసక్తి నెలకొంది. నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్ దంపతులు.. తమ కుమార్తె పరకాల వాంజ్ఞ్మయిని.. వరుడు ప్రతీక్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. ఈ క్రమంలోనే ప్రతీక్ ఎవరు అన్న దానిపై కుతూహలం నెలకొంది.


ప్రతీక్.. ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేసే ఒక అధికారి. ప్రతీక్ స్వస్థలం గుజరాత్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి.. ప్రతీక్ అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది. జాయింట్ సెక్రటరీ ర్యాంకులో.. ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ - ఓఎస్‌డీగా పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రధాన మంత్రి కార్యాలయంలో రీసెర్చ్ అండ్ స్ట్రాటజీ విభాగంలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం రీసెర్చ్ అండ్ స్ట్రాటజీ విభాగంలోనే కాకుండా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి.. కార్యదర్శిగానూ ప్రతీక్ విధులు నిర్వర్తిస్తారు. జూలై 2019 లో ప్రతీక్‌ను ఈ ఉద్యోగంలో నియమించినట్లు తెలుస్తోంది. ప్రతీక్‌.. సింగపూర్‌ మేనేజ్‌మెంట్‌ స్కూల్‌లో ఎంబీఏ చేశారు. గతంంలో గుజరాత్‌ సీఎంగా నరేంద్ర మోదీ ఉన్న సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రి కార్యాలయంలో రీసెర్చ్‌ అసిస్టెంట్‌గా ప్రతీక్ పనిచేశారు. ఇక నిర్మలా సీతారామన్‌ కుమార్తె పరకాల వాజ్ఞ్మయి ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఇంగ్లిష్‌ లిటరేచర్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత అమెరికా బోస్టన్‌లోని నార్త్‌వెస్టర్న్‌ యూనివర్సిటీలోని మిడిల్‌ స్కూల్‌ ఆఫ్‌ జర్నలిజం చేశారు. తర్వాత ప్రముఖ వార్తా సంస్థకు ఫీచర్‌ రైటర్‌గా పని చేస్తున్నారు.


నిర్మలా సీతారామన్‌, పరకాల ప్రభాకర్‌ దంపతుల కుమార్తె వాజ్ఞ్మయిని ప్రతీక్‌కు ఇచ్చి బుధవారం వివాహం జరిపించారు. అత్యంత నిరాడంబరంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు అతి కొద్దిమంది కుటుంబసభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. బెంగళూరులోని నిర్మలా సీతారామన్ నివాసంలో ఈ వివాహ వేడుకను జరిపారు. రాజకీయ ప్రముఖులెవరూ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం గమనార్హం. ఉడిపిలోని అదమరు మఠ్‌కు చెందిన పురోహితులు పెళ్లి క్రతువు జరిపించారు. అయితే ఈ వివాహం జరిగినట్లు సీతారామన్‌ కుటుంబసభ్యులు అధికారికంగా బయటికి చెప్పలేదు. అయితే ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com