కుల్ఫీ తిన్న 65 మంది పిల్లలు ఉన్నట్టుండి అనారోగ్యం బారినపడి ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని అల్వర్ జిల్లాలో జరిగింది. సమాచారం ప్రకారం చిన్నారులు ఒక వెండర్ దగ్గర కుల్ఫీలు కొనుగోలు చేసి వాటిని తిన్నవెంటనే వారికి కడుపునొప్పి, వాంతులు మొదలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం 50 మంది చిన్నారులు కోలుకోగా, మరో 15 మందికి ఇంకా చికిత్స కొనసాగుతోంది.