నైరుతి రుతుపవనాలు ఇప్పటికే కేరళలోకి ప్రవేశించి చురుగ్గా ముందుకు కదులుతున్నాయి. తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించిన రుతుపవనాలు, దేశంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణశాఖ తెలిపింది. మరో మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. అనంతపురం మీదుగా రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాలను రుతుపవనాలు తాకే అవకాశం ఉంది.