అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘బిపర్‌జాయ్’ తుపాను మరో 24 గంటల్లో మరింత తీవ్ర రూపం దాల్చనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. తుపాను ప్రభావంతో కర్ణాటక, గోవా, మహారాష్ట్రలోని తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. తుపాన్ మరింత బలపడి ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతుందని తెలిపింది. ఇది ప్రస్తుతం గోవాకు పశ్చిమాన 690 కి.మీ దూరంలో, ముంబైకి పశ్చిమ-నైరుతి దిశలో 640 కి.మీలో కేంద్రీకృతమై ఉంది.